కేశంపేట : అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో ఉన్న గ్రామానికి బస్సు సౌకర్యం నోచుకోలేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేశంపేట మండల పరిధిలోని పుట్టోనిగూడ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన్న పోలేదని గ్రామస్థులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పాఠశాలలు నడుస్తున్న రోజులలో షాద్నగర్ డిపో బస్సు రోజుకు ఒకసారి వచ్చి పోయేది. గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా మారడంతో అధికారులు బస్సులను గ్రామానికి రావడం ఆపేశారు. గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు ఇతర ప్రాంతాలకు వెళ్లాంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు బస్సులు లేకపోవడంతో కాలినడకన వెళ్తున్నారు. ఇప్పటికైన సంబందిత అధికారులు స్పందించి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement