Tuesday, November 26, 2024

వడగండ్ల వాన..బొప్పాయి తోటకి నష్టం..

షాద్‌నగర్‌ : షాద్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలోని నందిగామ మండలం ఈదుపల్లి గ్రామంలో కురిసిన ఆకాల వర్షంతో పాటు వడగండ్ల వానకు కాట్నా రవీందర్‌ బొప్పాయి రైతు నిలువునా మునిగిపోయాడు. గత సంవత్సరం ఆరు ఎకరాల్లో బోప్పాయి తోటలో సుమారు 6వేట చెట్లను నాటారు. ఆకాల వర్షాలతో వడగండ్లు పడి మొత్తం తోట సర్వ నాశనమైంది. ప్రతి చెట్టుకు ఏపుగా వచ్చిన పోప్పడి కాయలు, పండ్లు ధ్వంసం అయ్యాయి. రంజాన్‌ వేళ బొప్పాయి పంటకు ప్రాధాన్యత సంతరించుకుంది. బొప్పాయి పండ్లకు రంజాన్‌ వేల మార్కెట్‌లో బాగా గిరాకి ఉంది.ఈ నేపథ్యంలో రైతు రవీందర్‌ ఆశలు ఆడి ఆశలయ్యాయి. కురిసిన అతి భారీ వడగండ్ల వర్షానికి ఇంత పెద్ద ఎత్తున నష్టం వస్తుందని ఎవరు భావించలేదు. అసలు బొప్పాయి తోటలు పెట్టాలంటే ప్రకృతి వైపరీత్యాల కోసం రైతులు జంకుతారు. ఇలాంటి సమయంలో కొద్ది మంది రైతులు మాత్రమే ముందుకు వస్తారు. పొప్పడి తోట సాగుకు అనేక అవాంతరాలు ఉంటాయి. తెగుళ్లు, వైరస్‌ , నీళ్ల ఒడిదుడుకులు ఎదురవుతు ఉంటాయి. వీటిని అదిగమించి పంట చేతికి వచ్చే సమయంలో ప్రకృతి వైపరిత్యాలు రైతును ఇలా వెంటాడి నష్టం కలిగించడం విషాదాన్ని నింపుతుంది. రవీందర్‌ లాంటి రైతుని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఉద్యానవన వ్యవసాయ శాఖలకు బాధిత రైతు రవీందర్‌ సమాచారం అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement