Thursday, November 21, 2024

బ్లాక్‌ టీకి పెరిగిన ఆదరణ..

యాచారం : గతేడాది కాలంగా బ్లాక్‌ టీకి ఆధారణ పెరిగిందని చెప్పాలి. కరోనా మహమ్మారితో గతేడాది కాలంగా ప్రజలంతా పోరాడుతున్న సంగతి అందరికి తెలిసిందే. దీనికి తోడు ప్రజల తిండి, తాగుడు అలవాట్లను కూడ చాలా మంది మార్చుకున్నారు. అందులో భాగంగా ప్రతి నిత్యం బ్లాక్‌ టీని అలవాటు చేసుకున్నారు. బ్లాక్‌ టీలో నిమ్మరసం, తేనె, పుదినా వేసుకోని తాగడం అలవాటు చేసుకున్నారు. దీని వల్ల ఆరోగ్యం బాగుండటమే కాక శరీరానికి కావాల్సిన విటమిన్‌లు కూడ దొరుకుతున్నాయని చెప్పాలి. కరోనాను నియంత్రించేందుకు చాలా మంది ఉదయం, సాయంత్రం ఒక కప్పు బ్లాక్‌ టీని నిమ్మరసంతో తీసుకోవడం దినచర్యగా పెట్టుకున్నారు. ఆహారం విషయంలో కూడ చాలా వరకు చాలా మంది తమ అల వాట్లను మార్చుకున్నారు. అందులో బ్లాక్‌ టీ కూడ ఒకటని చెప్పుకోవాలి. గతంలో చాలా మంది టీను ఎక్కువగా తాగే వారు. కానీ ప్రస్తుతం చాలా మంది టీకి బదులుగా బ్లాక్‌ టీని ఎక్కువగా తీసుకుంటున్నారు. కొందరు లెమన్‌తో బ్లాక్‌ టీ తీసుకోకగా మరికొందరు అల్లంతో బ్లాక్‌ టీని తీసుకుంటున్నారు. మరికొందరు లెమన్‌, అల్లం రెండు కలిపి బ్లాక్‌ టీతో తీసుకుంటున్నారు. దీని వల్ల ఆరోగ్యానికి మేలు జరుగడమే కాకుండా గుండెకు సంబందించిన రోగాలు కూడ రావని కొందరు నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికి కరోనా చాలా మందికి చాలా కొత్త అలవాట్లు నేర్పిందని చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement