Monday, November 18, 2024

ఎన్టీఆర్ నగర్లో బస్తీ సమస్యలు పట్టవా : అధికారుల‌ను నిల‌దీసిన బిజెపి..

నిజాంపేట్, ఎన్టీఆర్ నగర్లో ఇళ్ల పట్టాలు, త్రాగునీటి కనెక్షన్, దోమల సమస్య తెలుసుకోవడానికి బిజెపి నిజాంపేట్ కార్పొరేషన్ కమిటీ సభ్యులు పాదయాత్ర చేయడం జరిగింది, ఈ పాదయాత్ర సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ ,రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం కాకుండా, పరిష్కరించాలని కోరారు. ఎన్టీఆర్ నగర్ 30 పైగా అర్హులైన పేదలకి పట్టాలు అందని పరిస్థితి, దోమల సమస్య వర్ణనాతీతం, కాలనీ పార్క్ వర్గ పోరుతో అభివృద్ధి కుంటుపడింది, చిన్న ఇల్లు కట్టుకునే ఇబ్బంది పెట్టే మున్సిపల్ అధికారులు,60 గజాల ప్రభుత్వ స్థలాల్లో నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్ ఎవరి పుణ్యం, శ్రీనివాస్ నగర్ కాలనీ నుండి వచ్చే రోడ్ని ఆక్రమించుకొని గోడ గట్టుకున్న మహానుభావులు ఎవరు? వంటి పలు సమస్యలు వంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు బిజెపి దృష్టికి తీసుకురావడం జరిగింది. పైగా డ్రైనేజ్ లైన్ శుభ్రం తరచుగా చేయడం లేదని, దోమల సమస్య ప్రజలు నరకం అనుభవిస్తున్నారని, తక్షణమే అంబర్ చెరువు శుభ్రం చేయాలని మరియు సెల్ ఫోన్ టవర్ వల్ల ఇబ్బందులు పడుతున్నారని రోడ్డు ఆక్రమణ ,ుఖ్యంగా అర్హులైన ఇళ్ల పట్టాలు లేని వారికి తక్షణమే ఇళ్ల పట్టాల కేటాయించాలని బిజెపి అధ్యక్షులు ఆకుల సతీష్ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ నగర్ కాలనీలో అన్ని మౌలిక వసతులు కల్పించే వరకు భారతీయ జనతా పార్టీ వెన్నంటి ఉంటుందని పేర్కొన్నారు . ప్రజా సమస్యల పరిష్కారం కాని యెడల ఏప్రిల్ నెలలో మున్సిపల్, రెవెన్యూ కార్యాలయాలు ముట్టడిస్తామని పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో లో బిజెపి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రాంచందర్ నాయక్, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు దాస నాగరాజు, కార్పొరేషన్ పార్టీ ఉపాధ్యక్షులు శివ కోటేశ్వర్ చౌదరి, కార్యదర్శి అరుణ్ రావు, సీనియర్ నాయకులు కుమార్ గౌడ్, రంజిత్, మాధవరావు ,శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement