Saturday, November 23, 2024

ప్రతి పౌరుడు భారత రాజ్యాంగంను చదవాలి..

ఘట్‌కేసర్ : ప్రతి పౌరుడు అసమానతలను పెంచే గ్రంథాలను కాకుండా సమానత్వాన్ని సూచించే భారత రాజ్యాగంను చదవి అవగాహన పెంపొందించుకోవాలని గ్రాండ్‌ మదర్‌ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కుంటోళ్లయాదయ్య అన్నారు. మహనీయుల ఉత్సవాలలో భాగంగా ఘట్‌కేసర్‌ మండలం అవుషాపూర్‌ గ్రామంలోని ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి నివాసంలో ఆయనను సంస్థ ఉపాధ్యాక్షులు, ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ కౌన్సిలర్‌ మేకల పద్మారావుతో కలసి ప్రథమ పౌరులకు, పాఠశాలలకు మన రాజ్యాంగం కార్యక్రమంలో భారత రాజ్యాంగం, మహనీయుల జీవిత చరిత్ర పుస్త్తకాలను అందించడం జరిగింది. ఈసందర్బంగా సంస్థ అధ్యక్షులు యాదయ్య మాట్లాడుతూ మండల ప్రథమ పౌరుడు ఎంపీపీ, గ్రామాలకు ప్రథమ పౌరులు సర్పంచ్‌లు భారత రాజ్యాంగంపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన కల్పించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. రాజ్యాంగంపై అవగాహన లేక మన హక్కులను తెలుసుకోలేక కోల్పోతున్నామని పేర్కొన్నారు. దశల వారిగా రాజ్యాంగంపై అవగాహన కల్పించడానికి తమ సంస్థ ద్వారా ఈకార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement