వికారాబాద్, డిసెంబర్ 23 (ఆంధ్రప్రభ) : వికారాబాద్ జిల్లా నవపేట మండలం చిరిగిద్ద గ్రామంలో ఆశా వర్కర్ అనిత (30) బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ఎందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిరిగిత గ్రామంలో ఆశా వర్కర్ గా పనిచేస్తున్న అనిత బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అనిత సంఘటన స్థలంలోనే మరణించినట్లు సమాచారం. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -