Tuesday, November 26, 2024

ఎండిపోతున్న ఎక్వా చెరువు ..

యాచారం : మండల పరిధిలోని మేడిపల్లి గ్రామంలో ఉన్న ఎక్వ చెరువులో నీరు పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురిసి చెరువులు, కుంటలు నిండటంతో ఇటు రైతులు అటు మత్స్యకారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. గత కొద్ది నెలల క్రితం మత్స్యకారులు ఎక్వ చెరువులో చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువులో వదిలిపెట్టారు. ఈ ఏడాది చెరువు నిండుగా ఉండటం వల్ల తమ బతుకులు కొంత మేరకైన బాగుపడతాయని అనుకున్నారు. గతేడాది అంతా కరోనాతో పోరాడి దుర్భర జీవితాన్ని గడిపారు. ఈ ఏడాది అయిన చెరువులో ఉన్న చెపలను అమ్ముకోని జీవితాన్ని సంతోషంగా గడుపుదామనుకుంటే చెరువు అప్పుడే ఎండుముఖం పట్టడంతో మత్స్యకారులకు కన్నీరే మిగిలిపోయింది. అతి తక్కవ సమయంలో నీళ్లు ఇంకడంతో మత్స్యకారులు తమకు నష్టం వాటిల్లిందని లబోదిబోమంటున్నారు. ఈ ఏడాది చేప పిల్లలు పెరిగి పెద్దగయితే తమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల్లా నడుస్తుంది అనుకుంటే చెరువు ఎండిపోతు ఉండటం వల్ల చేపలను పట్టి వచ్చిన కాడికి అమ్ముకునే పరిస్థితి నెలకొంది. మరికొద్ది రోజుల్లో చెరువు పూర్తిగా ఎండిపోవడం ఖాయమని అంటున్నారు. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు. ఏదిఏమైనప్పటికి చెరువుల్లో నీరు ఇంత త్వరగా ఇంకిపోవడం బాధకరమైన విషయమైన ఒక వైపు ఎండలు తీవ్రంగా మండుతుండటంతో మరోవైపు చెరువులకు అక్కడక్కడ గండిలు పడటం వల్లే చెరువులు ఎండుముఖం పడుతున్నాయని కావున వాటిపైన దృష్టి సారించాలని మేడిపల్లి ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement