Tuesday, November 19, 2024

కు.ని ఆపరేషన్‌ వికటించి మరో మహిళ మృతి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల్లో దారుణం జరిగింది. ఈ నెల 25న ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిలో 34 మంది మహిళలకు వైద్యులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేశారు. వైద్య విక‌టించి మూడు నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. ఒకే ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకున్న వీరు అస్వస్థతకు గురై మృతి చెందారు. మంగళవారం తెల్లవారుజామున మరో మహిళ లావణ్య మృతి చెందింది. దీంతో ఇప్పటి వరకు నలుగురు మహిళలు మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement