మేడ్చల్ : మండలంలోని గౌడవెల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అంగన్ వాడీ టీచర్స్‌తో గ్రామ సర్పంచ్ తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధికార ప్రతినిధి సురేందర్ ముదిరాజ్ గ్రామ అంగన్ వాడీ టీచర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గ్రామంలోని మూడు అంగన్ వాడీ సెంటర్లకు కొత్తగా హెల్పర్ (ఆయా) నియమాకాల గురించి చర్చించారు. అనంతరం అర్హులైన గౌడవెల్లి గ్రామ నివాసులు 35 సంవత్సరాల వయస్సు లోబడినవారు పదవ తరగతి పూర్తి చేసి వయస్సు కులం ఆదాయం సర్టిఫికేట్లతో ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని గ్రామస్థులకు సూచించారు. 15-4-2021 సాయంత్రం 4గంటల లోపు వెబ్ సైట్లో దరఖాస్తులు ఆన్లైన్లో సమర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ టీచర్లు సముద్రాల పేరందేవి, శారద, లక్ష్మీ, తదితరులు పాల్గోన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement