మొయినాబాద్ : వ్యవసాయ పొలంలో నీటి నిల్వ కోసం ఏర్పాటు చేసిన గుటంలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరి ధిలోని బాకారం రెవెన్యూ చోటుచేసుకుంది. ఎస్‌ఐ జగదీష్ తెలిపిన వివరాల ప్రకారం… నగరంలోని బైరమాల్‌గూడకు చెందిన ఉదయ్‌కుమార్‌కు మొయినాబాద్ మండల పరిధిలోని బాకారం రెవెన్యూలో వ్యవసాయ పొలం ఉంది. ఉదయ్‌కుమార్ తన భార్య, తల్లి, ఇద్దరు పిల్లలు, అన్న కొడకు, చెల్లెల్లి కొడుకు, వారి ఇంటి పక్కనే అద్దెకు ఉండే అంజయ్య కుమారుడు ఆనంద్‌గౌడ్(18)ను తీసుకొని వ్యవసాయ పొలం వద్దకు వచ్చారు. ఉదయ్ కుమార్ అతడి భార్య నాగిరెడ్డి గూడ ఉన్న తన బంధవుల వద్దకు వెళ్లడంతో పిల్లలంతా నీటి నిల్వకోసం ఏర్పాటు చేసిన గుంతలో ఈత కొట్టేందుకు దిగారు. ఆనంద్‌గౌడ్ కూడా ఈత కొడతానని నీటి గుంటలో దూకాడు. అతనికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందాడు. పిల్లలంతా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ జగదీష్ వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement