Saturday, November 23, 2024

హోలీ..ఆనంద కేళీ..

పరిగి : హోళి ఈ పేరు వింటేనే రంగుల ప్రపంచం కళ్లముందు కదలాడుతుంది. ఘనమైన చారిత్రక నేపథ్యం ఉన్న ఈ పండుగ జరుపుకునే తీరు రాను రాను మారిపోతుంది. స హజ సిద్ద రంగుల స్థానంలో కృతిమ రంగులు మార్కెట్‌లోకి వచ్చి గాలి, నీరు, వాతావరణం కలుషితమవుతునాయి. పండగ ఆనందం తరువాత ఆసుపత్రుల పాలవ్వడం పరిపాటిగా మారుతుంది. ఈ పండుగను నిషేధించాలంటే పరిస్థితి ఎలా ఉంటుందో అవగాతం చేసుకోవచ్చు. విజయ సంకేతంగా జరుపుకునే హోళీని సాంప్రదాయ బద్దంగా జరుపుకుంటే అంతకంటే ఆనందమేమీ ఉండదు. నేడు జరుపుకునే హోళీ పండుగ నేపథ్యం లో ఆంధ్రప్రభ ప్రతేక కథనం.

హోళి నేపథ్యం ఘనం..

రాజస్థాన్‌కు చెందిన రాజపుత్రుల నుంచి ఈ పండుగ ప్రపంచ వాప్తమైంది. శత్రువుల నుంచి తమ ప్రజలను కాపాడుకొని యుద్ద విజేతలుగా వచ్చిన వీరులను స్వాగతించే పండుగ ఇది. సుగంధాల నుంచి తయారు చేసిన సహజ సిద్దమైన రంగు నీళ్లను వీరులపై చల్లి స్వాగతించేవారు. సుగంధపు నీరు చల్లడంతో వీరుల శరీరంలోని మలినాలు బయటకు వ చ్చి వారు మరింత ఉత్తేజితులయ్యేవారు. రాజపుత్రుల హోళి సంప్రదాయాన్ని మొగలు చక్రవర్తులు కూడా కొనసాగించారు. ఆ నాటి నుండి ఈ పండుగను సాంప్రదాయ బద్దంగా జరుపుకుంటున్నారు.

రసాయనిక రంగులతో అనర్థాలు..

రసాయనిక రంగులువాడటం వల్ల చర్మవాధులకు గురవుతారు.
గాలిలో కలసిన రంగులు పీల్చడం వల్లన నిమోనియా వచేచ అవకాశం ఉంది. గొంతు ఇన్పెక్షన్‌ రావచ్చు.
జీర్ణకోశ సంబంధిత వాధులు వచ్చే అవకాశం ఉంది. చిన్న పిల్లలకు కళ్లలోల రంగు పడటం వల్ల కంటి చూపుకు ఇబ్బంది కలుగుతుంది. ఒక్కోసారి కంటి చూపు కూడా పోయే ప్రమాదం ఉంది.
రసాయనిక రంగుల వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడటమే కాక కొన్ని రంగులు శరీరంపై విఫరీత ప్రభావం చూపిస్తాయి. కొన్ని రోజుల పాటు ఆ రంగు అలాగే ఉంటుంది.
– హోళి రంగులతో వెళ్ళి వాగులు, చెరువులు, కాలువల వద్ద స్నానాలు చేస్తుంటారు. దీంతో చేపలు, ఇతర జీవులు మృత్యువాత పడుతాయి.

- Advertisement -

సహజ రంగుల తయారీ ఇలా..!…

పసుపు రంగు..: రెండు టీ స్పూన్‌ల పసుపు, నాలుగు టీ స్పూన్‌ల బియ్యం పిండి, శనగ పిండి కలిపితే పసుపు రంగు వస్తుంది. బంతి పూలను నీటిలో మరగబెట్టిన పసుపు రంగు వస్తుంది.

ఆకు పచ్చ రంగు..: బియ్యం పిండిలోగోరింటాకు పొడిని కలిపితే పచ్చరంగు వస్తుంది. గోరింటాకు పొడితో సైతం చిక్కటి రంగు వస్తుంది.

గులాబి రంగు..: బీట్‌ను ముక్కలుగా కోసి నీటిలో నానబెడితే గులాబి రంగు వస్తుంది. అలాగే పసుపు, గంధం పొడిలో రోజ్‌ వాటర్‌ చేర్చితే నీలి రంగు వస్తుంది.

ఎరుపు రంగు..: బియ్యం పిండిలో ఎర్ర చందనం పొడిని కలిపితే ఎరుపు రంగు వస్తుంది.
మందారం పూలను ఎండబెట్టి పొడి చేసి నీటిలో కలిపిన ఎరుపు రంగు వస్తుంది.

మోదుగ పూలతో కూడా..: వేసవి రాకకు సంకేతాలుగా మోదుగ పూలు పూస్తాయి. ఇవి వికసించాయంటే వేసవితో పాటు రంగుల పండుగ వచ్చిన్నట్లే. ఈ పూలతో కూడా రంగులను తయారు చేసుకోవచ్చు. వీటితో ఆరెంజ్‌, ఎరుపు రంగులను తయారు చేసుకోవచ్చు. పూర్వ రోజుల్లో హోళీ పండుగకు వారం రోజులుగా ముందుగా మోదుగ పూలను తెచ్చి వాటిని ఉడికంచి సహజ సిద్దమైన రంగులు చేసేవారు. ప్రస్తుతం వీటి వాడకమే మానేశారు.

తీసుకోవల్సిన జాగ్రతలు..

కళ్లు, ముక్కు, చెవిలోకి రంగులు పోకుండా చూసుకోవాలి. చేతులు, కాళ్లు పూర్తిగా కవరు చేసే దుస్తులు ధరించాలి. రంగుల వల్ల చర్మం పొడిభారే అవకాశం ఉంది. దీంతో చర్మ సంబంద వ్యాధులు కలుగవచ్చు. హోళి ఆడేందుకు వెళ్లే ముందు చర్మంపై కొబ్బరి నూనె రాసుకోవాలి. హోళీ ఆడాక నీటితో కడిగేసుకొని పాలతో ముఖం సుభ్రం చేసుకుంటే చర్మం మృదువుగా ఉంటుంది. కోడి గుడ్లు, బురద, రాళ్ళు, షూ పాలీస్‌ లాంటి కలర్స్ దూరంగా ఉండాలి. కళ్ళలో రంగులు పడితే వెంటనే శుభ్రంగా కడుకోవాలి. చిన్న పిల్లలు కళ్ల అద్దాలు పెట్టుకుం టే కళ్లను రక్షించుకోవచ్చు. కళ్ల, చర్మం దురదగా ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement