Sunday, September 8, 2024

RR: గ్రూప్-1 పరీక్షలకు సర్వం సిద్ధం… అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ

వికారాబాద్, జూన్ 7 (ప్రభ న్యూస్) : గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జూన్ 9న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి చేపట్టాల్సిన విధి విధానాలపై ఐడెంటిఫికేషన్ అధికారులు, శాఖపరమైన అధికారులు, పరీక్ష నిర్వహణ పరిశీలకులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ…. జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా, అతి జాగ్రత్తగా పరీక్ష నిర్వహించాలన్నారు. పరీక్ష విధులు నిర్వహించే అధికారులు సమన్వయతో పని చేయాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్తు, టాయిలెట్స్, త్రాగునీరు ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. రూట్ అధికారులు తమ లోకేషన్లను ముందస్తుగానే చూసుకోవాలని, శాఖ అధికారులు పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో వెళ్లి పర్యవేక్షించాలని ఆయన తెలిపారు.

ఐడెంటిఫికేషన్ అధికారులు అభ్యర్థి హాల్ టికెట్, ఫోటోను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు తమ విధులను సక్రమంగా నిర్వహించేందుకు సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. పరీక్ష సమయంలో ఎలాంటి తప్పులు జరిగిన సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ హెచ్చరించారు. పూర్తి పోలీసు బందోబస్తు మధ్య పరీక్ష నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. శిక్షణా కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తో పాటు టీజీపీఎస్సీ రీజనల్ కోఆర్డినేటర్ రాజేష్ ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement