Friday, November 22, 2024

రిజర్వాయర్‌ ఏర్పాటు కోసం స్థల పరిశీలన..

జిన్నారం : జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ ప్రజలకు తాగునీటిని అందించేందుకు రిజర్వాయర్‌ను ఏర్పాటు చేసేందుకు జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ రాజర్షిషా, మున్సిపల్‌ చైర్మ్‌పర్సన్‌ కోలన్‌ రోజుబాల్‌రెడ్డి, కమీషనర్‌ రాజేంద్రకుమార్‌తో కలిసి బొల్లారంలో స్థలం పరిశీలన చేశారు. హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ సహకారంతో మున్సిపల్‌ ప్రజలకు త్రాగునీటి ఎద్దడిని దూరం చేసేందుకు రిజర్వాయర్‌ ఏర్పాటు చేయనున్నట్లు అడిషనల్‌ కలెక్టర్‌తో కలిసి స్థల పరిశీలన చేసినట్లు చైర్‌పర్సన్‌ రోజారాణి, కమీషనర్‌ రాజేంద్రకుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి జీఎం నారాయణ, మేనేజర్‌ హనుమంత్‌, మున్సిపల్‌ డీఈ రఘు, తహశీల్దార్‌ దశరథ్‌, ఏఈఈ కిష్టన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement