తెలంగాణ ప్రభుత్వం 8వ తేదీ నుండి విద్యాసంస్థలన్నింటికీ సెలవులు ప్రకటించినవేళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అనురాగ్ యూనివర్సిటీని నడపడమే కాకుండా ప్రశ్నించిన విద్యార్థులపై అక్రమ కేసులు బనాయించటాన్ని నిరసిస్తూ ఐడీపీఎల్ చౌరస్తాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మేడ్చల్ VIBHAG చింతల శాఖ ఆధ్వర్యంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనురాగ్ యూనివర్సిటీని నిర్వహించడాన్ని నిరసిస్తూ IDPL చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా శంషాబాద్ విభాగ్ కన్వీనర్ షపురం శ్రీకాంత్, నగర కార్యదర్శి బట్టు వినయ్ కుమార్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం వెలువరించిన జీవోని విస్మరిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని MLC పల్లా రాజేశ్వర్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా అనురాగ్ యూనివర్సిటీ నిర్వహిస్తున్నా అధికారులు ఏమీ తెలియనట్లు వ్యవహరించటం చూస్తుంటే తెలంగాణలో అధికార పార్టీ నాయకులకు ఒక రూల్స్ ..సామాన్య ప్రజలకు ఒక రూల్స్ అనే విధంగా ఉందన్నారు.
ఈనెల 8 నుండి ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినప్పటికీ దొంగచాటున తరగతులు నిర్వహిస్తున్నటువంటి అనురాగ్ యూనివర్సిటీని విద్యార్థులతో కలిసి ప్రశ్నించిన ఏబీవీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి భయపెట్టాలని చూడడం సిగ్గుచేటన్నారు. కేసులు విద్యార్థులపై కాదు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న అనురాగ్ యూనివర్సిటీ యాజమాని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పరశురామ్, గణేష్, మహేష్, కిరణ్, ఉదయ్, బిందు, నారోత్తం, అక్షయ్, వికాస్, సాయికిరణ్, అజయ్, శ్రీకాంత్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital