Tuesday, November 19, 2024

Vikarabad: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ..

వికారాబాద్, ఆగస్టు 17(ప్రభ న్యూస్): పశ్చిమ బెంగాల్ లోని కోల్కతాలో వైద్య విద్యార్థులపై అత్యాచారం హత్య చేయడం నివసిస్తూ వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సినీమాక్స్ థియేటర్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వికర్మ శాఖ అధ్యక్షులు డాక్టర్లు నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్లు మధుసూదన్ రెడ్డి డాక్టర్ టి ఆనంద్ డాక్టర్ పురుషోత్తం డాక్టర్ గిరిష డాక్టర్ సృజన్ తో పాటు వంకధర శ్రీనివాస్ అశోక్, వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు మాధవ రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు ఎస్క్ శిరీష, పట్టణ అధ్యక్షుడు నరోత్తం రెడ్డి, నాయకులు రవితేజ, తదితరులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ సాధువు సత్యం మాట్లాడుతూ… వైద్య విద్యార్థిపై అత్యాచారం, హత్య చేయడం సమంజసం కాదన్నారు. రాబోయే రోజుల్లో డాక్టర్లు మరింత నిరసన వ్యక్తం చేస్తామని ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement