యాచారం : యాచారం పట్టణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో 20మందికి కరోనా ర్యాపిడ్ టెస్టులు చేయగా అందులో 5గురికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. చౌదర్పల్లి గ్రామంలో 2. రాగన్నగూడ 3, పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ నాగజ్యోతి తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కరోనాను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదని సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులను తప్పని సరిగ్గా ధరించాలని ఆమె కోరారు. ఏది ఏమైనప్పటికి గత సంవత్సరంతా కరోనాతో తల్లడిల్లి పోయి ప్రజలంతా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోన్నారు. కరోనా మహమ్మారి అంతరించి పోతుంది అనుకున్న సమయంలో మళ్లిd సెకండ్ వేవ్ రాష్ట్రం అంతటా వ్యాపిస్తా ఉంది. గత కొద్ది రోజుల క్రితం రెండు అంకేలకే పరిమితం అయిన కరోనా పాజిటివ్‌ల సంఖ్య ఇప్పుడు మూడు అంకేలకు చేరుకుంది. కావున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement