వికారాబాద్, (ప్రభ న్యూస్): వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 21వ వార్డు రామయ్య గూడా ఎంఐజి అభివృద్ధి కోసం పది లక్షల రూపాయలను కేటాయిస్తున్నట్టు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 21వ వార్డు రామయ్య గూడా ఎంఐజిలో మీతో నేను కార్యక్రమంలో భాగంగా వార్డులో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా వీధి దీపాలు డ్రైనేజీ తదితర సమస్యలు లేకుండా వార్డు ఉండడం ఆనందదాయకమని అన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరిస్తామని కాలనీవాసులు సమిష్టిగా ఉండాలని ఆయన సూచించారు. 21 వార్డ్ కౌన్సిలర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ తమ వార్డులో ప్రధానంగా ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశంలో కౌన్సిలర్లు అనంతరెడ్డి గోపాల్ పిఎసిఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ తబిత, ఆర్ ఓ శివ, పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, నాయకులు విజయ్ కుమార్ కాప్షన్ సభ్యులు రాజమల్లు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement