Monday, November 18, 2024

సమ్మర్‌ వచ్చేసింది జర జాగ్రత్త..

షాద్‌నగర్‌: వేసవి కాలం ప్రారంభమైంది. ఎండలు మండిపోతున్నాయి. ఇక వడగాలులు కూడ వీచే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరం, నీటి పరిణామం అధికంగా ఉంటే పండ్లు తింటే..బాడి డిహైడ్రేట్‌ అవ్వకుండా ఉంటుంది. ఈ సీజన్‌లో కొద్దిగా అజాగ్రత్త మీ ఆరోగ్యానికి హనికరం కాగా ఏయే పండ్లు మనకు సమ్మర్‌లో సహాయ పడతాయో తెలుసుకుందాం.
పుచ్చకాయ
పుచ్చకాయలో 70శాతం నీరు ఉంటుంది. ఇందులో నీరు మాత్రమే కాకుండా విటమిన్‌ సి, విటమిన్‌ ఏ, మెగ్నిషియం కూడ అధికంగాఉంటాయి.పుచ్చకాయలో కేలరీల పరిమాణం కూడ తక్కవ. దీన్ని తినడం వల్ల బరువు పెరగదు. అనేక రకాల యాంటి ఆక్సిడెంట్లు పుచ్చకాయలో ఉన్నాయి. దీని వల్ల డయాబెటిస్‌, హృదయ సంబంద వ్యాధుల ప్రమాదం ఉండదు.
నేరేడు పండు..
నేరేడు పండులో బిటా – కెరాటిన్‌ ఉంటుంది. ఇది చర్మానికి కూడ మేలు చేస్తుంది. రోజు తీసుకోవడం ద్వారా స్కిన్‌ ఆయిలీ కాకుండా ఉంటుంది.
దొసకాయ..
వేసవిలో దోసకాయ తినడం చాలా ప్రయోజనకరం. దీన్ని తినడం ద్వారా శరీరంలో నీటి కొరత ఉండదు. దోసకాయలలో విటమిన్‌ కె. పోటాషియం, మెగ్నిషియం, పైబర్‌ పుష్కలంగా ఉంటాయి. ఇది మలబద్దకం సమస్యను తొలగిస్తుంది. దోసకాయ తినడం వల్ల ఎక్కడసేపు దాహాం ఉండదు.
కివి..
కివి యొక్క పుల్లని తిపి రుచి చాలా మందికి చచ్చుతుంది. దీనిలో విటమిన్‌ బి1, బి2, బి3 విటమిన్‌ సి పుష్కలంగా ఉంటాయి. దీని తినడం వల్ల గుండె, పళ్లు, మూత్రపిండాలు, మెదడుకు చాలా మంది జరుగుతుంది.
పెరుగు..
పెరుగులో విటమిన్లు,కాల్షియం, భాస్వరం, పోటాషియం, ఖనీజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మీ ఎముకలకు కూడ మంచిది, మీరు 250 గ్రాముల పె రుగు తింటే అందులో 75 శాతం నీరు ఉంటుంది. ఇందులో ప్రోటిన్‌ పుష్కలంగా ఉంటుంది. బరువును తగ్గాలనుకుంటే పెరుగును ఆహారంలో చేర్చండి
కొబ్బరి నీరు, మజ్జీగ..
వేసవిలో, శరీరాన్ని చల్లగా ఉంచడానికి మజ్జీగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి.మజ్జిగలో లాక్టిక్‌ ఆవ్లుం ఉంటుంది. ఇది చర్మంతో పాటు జీర్ణక్రియకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొబ్బరి నీళ్లు తాడం వల్ల శరీరంలో నీటి కొరత ఉండదు. ఇందులో కాల్షియం, క్లోరౖౖెడ్‌, పోటాషియం పుష్కలంగా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement