బషీరాబాద్ : బషీరాబాద్ మండల పరిధిలోని జీవన్గి నది ఒడ్డున వెలసిన శ్రీ హరి హార మహాదేవ లింగేశ్వర జాతర ఉత్సవాలు మూడు రోజులుగా భజనలు ప్రత్యేక పూజలు కల్యాణోత్సవాలు భజన కార్యక్రమాలతో పాటు అగ్నిగుండం, ఎడ్ల బండి పోటీలు, రథోత్సవం, కుస్తీ పోటీలు వంటి కార్యక్రమాలతో మూడు రోజుల పాటు ఉత్సాహాం కొనసాగింది. జాతర ఉత్సవాలకు కర్నాటక.. మహారాష్ట్ర ..తెలంగాణ రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. వీరితో పాటు తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కూడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ జాతర ఉత్సవాలకు జీవన్గి గ్రామంలోని కుటుంబాలలో బంధుమిత్రులతో కిటకిటలాడాయి. గ్రామంలోని ప్రజలు పెద్ద చిన్నా తేడా లేకుండా జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జాతర ఉత్సవాలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు మూడు రోజుల పాటు బందోబస్తు ఏర్పాటు చేసి సహాకరించారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మౌనికరెడ్డి, ఎంపిటిసి , వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు మాణిక్‌రెడ్డి, వీరారెడ్డి, నర్సిరెడ్డి, నారాయణరెడ్డి, మల్లికార్జున్ , మాధవరెడ్డి, మునిందర్‌రెడ్డి, రాములు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement