తాండూరు : తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ స్వప్న పరిమళ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ప్రతిపక్ష కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ ప్రభాకర్‌గౌడ్, పార్టీ ఫ్లోర్‌లీడర్ వరాల శ్రీనివాస్‌రెడ్డి, సీపీఐ ఫ్లోర్‌లీడర్ అసిఫ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి యువసేన నాయకులు రఘునందన్‌రెడ్డిలు వికారాబాద్ జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్, జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ సదంర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం జరిగిన ఎ మ్మెల్సీ ఎన్నికల్లో తాండూరు పట్టణంలోని జూనియర్ కళాశాలలోని 283 పోలింగ్ కేంద్రంలో చైర్‌పర్సన్ స్వప్న పరిమళ్ తన బందువుల పేరిట ఉన్న ఓటును దొంగతనంగా వినియోగించుకున్నారని అన్నారు. ఈ మేరకు చైర్‌పర్సన్ స్వప్న పరిమళ్‌పై సెక్షన్ 171-డీ, 171-ఎఫ్ కింద క్రిమినల్ కేసు నమోదు చేయాలని, అదేవిధంగా ఎన్నికల కమిషన్ ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement