యాచారం : కొత్తిమీర వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. కొత్తిమిరే కదా అని తీసి పారేయకండి . నేడు ప్రతి ఇంట్లో ఏ కూర వండిన సరే చివరలో కొత్తిమీర చల్లితే ఆ రుచి వాసన వేరుగా ఉంటుంది. కొత్తిమీర కట్టను చిన్నగా తరగి కూరగాయలపై చల్లితే చూడటానికి చూడముచ్చటగా ఉంటుంది. రుచి కోసం మాత్రమే కొత్తిమీరను కూరలలో వాడుతారు అనుకుంటే అది నిజంగా పోరపాటే. ప్రతి నిత్యం కొత్తిమీర తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు హైబిపి, గుండె పోటు లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఒక్కసారి కొత్తిమిర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎంటో తెలుసుకుందాం. రక్తపోటు నియంత్రణ, అధిక రక్తపోటు క్రమంగా , రెండవ దశ డయాబెటిస్‌కు దారి తీస్తుంది. అదే కూరలలో కొత్తిమీర తినడం వల్ల బిపి దగ్గడమే కాకుండా రక్తంలోని చక్క స్థాయిలను తగ్గించడంలోను కూడ కొత్తిమీర చాలా బాగా పని చేస్తుంది. అదే విదంగా ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలోను కొత్తమీర ఎంతో దోహాదపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుదల కొత్తిమీరలో పుష్కలంగా ఉంటాయి. అవి శరీర కణాలను కాపాడుతు ఉంటాయి. కొత్తిమీర ఆకులు హనికరమైన కొవ్వును తగ్గించి ఆరోగ్యకరమైన కొవ్వును పెంచుతుంది. అధిక రక్తపోటు కంట్రోల్‌లో ఉంచడంతో పాటు కోలాస్ట్రాల్ లేవల్స్‌ను నియంత్రిచడం వల్ల ఎంతో మంచిని చేకూరుస్తుంది. అదే విధంగా యాంటి ఆక్సిడెంట్‌లు మనలోని యాంగ జైటిని తగ్గిస్తాయి. అదే విధంగా నాడి వ్యవస్థను మెరుగు పరుస్తు జీర్ణక్రీయ మెరుగు అవుతుంది. కొత్తిమీర ప్రతి రోజు తినడం వల్ల కడుపులోని పేగులు శుభ్రం అవుతాయి. దీనితో జీర్ణక్రీయ మెరగవుతుంది, మలబద్దకంతో బాధపడే వారు కొత్తిమీరను రోజు తినడం ఎంతో లాభదాయకం. అదే చర్మ సంరక్షణ, చర్మంపై దుద్దురులు, మెటిమలు, గాయాల వల్ల వచ్చే మచ్చల నివారణకు కొత్తిమీర ఎంతోగాను ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు .కావున ప్రతి ఒక్కరు కొత్తిమీరను ప్రతి నిత్యం తినే అలవాటును చేసుకోవాలి. ఇంటి ముందు ఖాళీ స్థలం ఉన్న వారు కొత్తిమీరను పెంచుకుంటే కోనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు.
Advertisement
తాజా వార్తలు
Advertisement