తాండూరు : హైదరాబాద్, మహాబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తాండూరులో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా 8 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తాండూరు పట్టణం, తాండూరు మండలానికి సంబంధించి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 5 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బషీరాబాద్ మండలానికి సంబంధించి మండల కేంద్రంలోని బాలుర జిల్లా పరిషత్ పాఠశాల, పెద్దేముల్ మండలానికి సంబంధించి మండల కేంద్రంలోని బాలికల జిల్లా పరిషత్ పాఠశాల, యాలాల మండలానికి సంబంధించి మండల కేంద్రంలోని బాలుర జిల్లా పరిషత్ పాఠశాలలో ఒక్కో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తాండూరు పట్టణంలో 3213 మంది, తాండూరు మండలంలో 692, యాలాల మండలంలో 865, బషీరాబాద్ మండలంలో 694, పెద్దేముల్ మండలంలో 723 మంది పట్టభద్రులు ఉండగా, ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 6,187 మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. శనివారం సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి చేరుకుంది. ఆయా కేంద్రాల్లో అధికారులు కూడ విధులు నిర్వహించేందుకు వచ్చేశారు. ఆదివారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ కొసాగుతుందని అధికారులు వె ల్లడించారు.
పోలింగ్ కేంద్రాలను సందర్శించిన తహసీల్దార్
————————————————–
మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తాండూరు పట్టణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను తహసీల్దార్ చిన్నప్పల నాయుడు సందర్శించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్రాల్లో ఎన్నికల అధికారితో పాటు విఆర్ ఓ, విఆర్‌ఏలను నియమించడం జరిగిందని చెప్పారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అందరు సహకరిచించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట డిప్యూటి ధనుంజయ, ఆర్‌ఐ రాజారెడ్డి, సిబ్బంది సాయిరెడ్డి తదితరులు ఉన్నారు.