యాచారం: యాచారం మండల కేంద్రంలో బిజేపి మండల అధ్యక్షుడు తాండ్ర రవీందం ఆధ్వర్యంలో జగ్జీవన్, అంబేద్కం విగ్రహాలకు పాలాభిషేకాన్ని చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబాద జిల్లా దుళికట్ట గ్రామంలో గురుకులాల కార్యదర్శి చేసినటువంటి ప్రతిజ్ఞపె బిజేపి రాష్ట్ర మహిళ మోర్చా అధ్యక్షులు కొప్పు భాషాపె దుష్పప్రచారం చేయడం దారుణమని అన్నారు. ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి ఒక మతానికి సంబంధించిన దేవుళ్లని పూజించవద్దు అని చెప్పడం పద్దతి కాదు అని చెప్పితే కొంత మంది బండిసంజయ్గారి దిష్టిబోమ్మను దహానం చేయడం జరిగిందని అందుకోసం మండల కేంద్రంలో ఉన్నటువంటి డాక్టంఅంబేద్కం, బాబు జీగ్జీవన్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగిందని అన్నారు. కావున మరోసారి భారతీయ జనతా పార్టీ నేతలపెన ఆరోపణలు చేస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. దేశంలో ఉంటూ ఉన్నత ఉద్యోగాన్ని చేస్తు ఒక మతానికి సంబందించి వ్యతిరేకంగా మాట్లాడటం సరియైనది కాదని వారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చ ప్రధాన కార్యదర్శి మర్రిపల్లి అంజయ్య, ఎస్సీ మోర్చ రాష్ట్ర నాయకులు యాదయ్య, భాజపా నేతలు యాదయ్య, మస్కు అబ్బాయ్య, నారిమళ్ల రమేష్, మస్కు యాదయ్య, శ్రీనివాస్ గుప్తా,కృష్ణ, బాలవర్ధన్రెడ్డి, శాంతికుమార్, నాగరాజు, రమేష్, శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement