Friday, January 24, 2025

Rangareddy – సాంకేతిక విద్య సమాజ అభివృద్ధికి బాటలు వేయాలి – సాంకేతిక విద్యా మండలి చైర్మన్

ఆంధ్రప్రభ, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : సాంకేతిక విద్యా సిలబస్ రూపకల్పన సమాజ అభివృద్ధికి తద్వార దేశాభివృద్ధికి బాటలు వేసేలా ఉండాలని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య మండలి చైర్మన్, హైదరాబాద్ జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ వి. బాలకిష్టా రెడ్డి తెలిపారు.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్ పల్లి సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరుగుతున్న సస్టయినబుల్ మెటీరియల్స్, టెక్నాలజీ అప్లికేషన్ ఇన్ ఇంజనీరింగ్ అంతర్జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన డాక్టర్ వి. బాలకిష్టా రెడ్డి సీవీఆర్ విద్యా సంస్థల చైర్మన్ రాఘవ వి చిరాబుడ్డి తో కలిసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రాభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా రోజుకో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయని నిరంతరం అప్రమత్తంగా ఉంటేనే పోటీ ప్రపంచంలో నిలబడగలమన్నారు.


ఇంకా ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా ఐఐటి ఖరగ్ పూర్ ప్రొఫెసర్ డాక్టర్ అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. కళాశాల చైర్మన్ డాక్టర్ రాఘవ వి చిరాబుడ్డి, కళాశాల ప్రిన్సిపల్ కే రామ్మోహన్ రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ కే రామశాస్త్రి, సివిల్ ఇంజనీరింగ్ విభాగ అధిపతి డాక్టర్ బి నాగమల్లేశ్వరరావు,అంతర్జాతీయ సదస్సు కన్వీనర్ డాక్టర్ టి మురళీధర్ రావు, కళాశాల వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ లక్కం శివారెడ్డి, డీన్స్, అసోసియేట్ డీన్స్ వివిధ విభాగాల అధిపతులు ఆధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement