Monday, September 16, 2024

Rangalal Kunta – జయభేరీకి హైడ్రా నోటీసులు

రంగలాల్​ కుంటలో ఆక్రమణలు ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్​లో నిర్మాణాలు
వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ
భాగీరథమ్మ చెరువును పరిశీలించిన రంగనాథ్​
చెరువు పరిధిలో వ్యర్థాల పారబోతపై సీరియస్​

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ :
హైదరాబాద్ వ్యాప్తంగా చెరువుల ఆక్రమణలు తొలగించి చెరువుల పరిరక్షణకు శ్రీకారం చుట్టిన హైడ్రా తన దూకుడు కొన‌సాగిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ జయభేరికి నోటీసులు జారీ చేసింది. రంగళాల్ కుంట చెరువు ఎఫ్‌టీఎల్, బ‌ఫ‌ర్ లో నిర్మాణాలను తొలగించాలని జయభేరి నిర్మాణ సంస్థకు ఆదేశాలు జారీ చేశారు.

భాగీర‌థ‌మ్మ చెరువు క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ ప‌రిశీల‌న‌
భాగీరథమ్మ చెరువు ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప‌రిశీలించారు. చెరువు ఎఫ్టిఎల్, బఫర్ జోన్లో ఉన్న నిర్మాణ వ్యర్ధాలను వేయడంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. మరో 15 రోజుల్లో పూర్తిస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement