Wednesday, December 25, 2024

Ranga Reddy – గోనే సంచిలో శ‌వం…

రంగారెడ్డి జిల్లాలోని మైలార్‌దేవ్‌పల్లిలో డెడ్‌ బాడీ కలకలం రేపుతోంది. గోనే సంచిలో డెడ్ బాడీ ఉన్నట్లు జీహెచ్ఎంసీ కార్మికులు నేటి ఉద‌యం గుర్తించారు. వెంటనే 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు కార్మికులు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న మైలార్ దేవ్ పల్లి పోలీసులు గోనె సంచిలో ఉన్న డెడ్ బాడీని పరిశీలించారు. కాగా.. ఈరోజు ఉదయం ఎప్పటిలాగే జీహెచ్‌ఎంసీ కార్మికులు రోడ్డు శుభ్రం చేసే పనిలో ఉన్నారు. ఇంతలో వారికి ఓ గోనె సంచి కనిపించింది. అనుమానాస్పదంగా ఉన్న గోనె సంచిని చూసిన కార్మికులు దాన్ని తెరువగా అందులో ఉన్న దాన్ని చూసి ఖంగుతిన్నారు.

గోనె సంచిలో మృతదేహం ఉండటంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తోటి కార్మికులకు తెలియజేయగా అంత వచ్చి గోనెసంచిలో డెడ్‌బాడీని చూశారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నారు. గోనెసంచిలో వ్యక్తిని ఎక్కడో చంపి సంచిలో మూటగట్టి దుర్గానగర్‌ నగర్‌లో దుండగులు పడేసినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో హత్యకు గురైన వ్యక్తి ఎవరు.. ఎక్కడి నుంచి గోనెసంచిని తీసుకువచ్చారు అనే సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు పోలీసులు.

- Advertisement -

వెంటనే క్లూస్‌ టీం కూడా అక్కడకు చేరుకుని క్లూస్‌ను సేకరిస్తున్నారు. క్లూస్‌ టీం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ మృతదేహం ఎవరిది అనే కోణంలో విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో సీసీ టీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement