Friday, November 22, 2024

రంజాన్ – జంట నగరాలలో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మీరాలం ఈద్గా, మాసాబ్ ట్యాంక్ హాకీ గ్రౌండ్స్ పరిసరాల్లో నేటి ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకు(మూడున్నర గంటలు) ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ మార్గాల్లో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు..

-పురానాపూల్, కామటిపురా, కిషన్ బాగ్ నుంచి మీరాలం ఈద్గాకు ప్రార్థనల కోసం వచ్చే వారి వాహనాలను బహదూర్‌పురా క్రాస్ రోడ్స్ వరకే అనుమతిస్తారు. సాధారణ ట్రాఫిక్‌ను తాడ్‌బన్‌, ఈద్గా వైపు అనుమతించరు. సాధారణ ట్రాఫిక్‌ను దానమ్మ హాట్స్ క్రాస్ రోడ్డు వద్ద శాస్త్రిపురం వైపు అనుమతిస్తారు. మోచి కాలనీ, బహదూర్‌పురా, షంషీర్‌గంజ్‌, నవాబ్ షాహెబ్ కుంట వైపు వాహనాలను మళ్లించనున్నారు.

-పురానాపూల్ నుంచి బహదూర్‌పురా వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను పురానాపూల్ దర్వాజా వద్దనే మళ్లించనున్నారు. శంషాబాద్, రాజేంద్రనగర్‌, మైలార్‌దేవ్‌పల్లి నుంచి బహదూర్‌పురా వైపు వచ్చే వాహనాలను ఆరాంఘర్ జంక్షన్ వద్ద పలు మార్గాల్లో మళ్లించనున్నారు.-మాసబ్ ట్యాంక్ ఫ్లై ఓవర్ కింద వాహనాలను అనుమతించరు. లక్డీకాపూల్, మోహదీపట్నం నుంచి వచ్చే వాహనాలను ఫ్లై ఓవర్ మీదుగానే అనుమతిస్తారు. -మెహిదీపట్నం నుంచి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1 వైపు వచ్చే వాహనాలను మాసబ్ ట్యాంక్ మీదుగా అయోధ్య జంక్షన్, ఖైరతాబాద్, ఆర్టీఏ కార్యాలయం, ఖైరతాబాద్, తాజ్ కృష్ణా హాటల్ మీదుగా వాహనాలకు అనుమతి ఇవ్వనున్నారు. లక్డీకాపూల్ నుంచి మాసబ్ ట్యాంక్ మీదుగా రోడ్ నంబర్ 1, 12 వైపు వచ్చే వాహనాలను అయోధ్య జంక్షన్, నిరంకారి భవన్, ఖైరతాబాద్, వీవీ విగ్రహం, ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు, తాజ్ కృష్ణా హోటల్ మీదుగా అనుమతించనున్నారు. ప్రార్థనలు ముగిసే వరకు మాసబ్ ట్యాంక్ ఫ్లై ఓవర్ కిందకు వాహనాలను అనుమతించరు.-బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 నుంచి మాసబ్ ట్యాంక్ వైపు వచ్చే వాహనాలను తాజ్ కృష్ణా హోటల్, ఆర్టీఏ కార్యాలయం మీదుగా అనుమతించనున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement