Friday, November 22, 2024

TS: రామోజీరావు మరణం చాలా బాధాకరం… మాజీమంత్రి తలసాని

హైదరాబాద్ : ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మరణం చాలా బాధాకరమ‌ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రామోజీరావు మృతి వార్త తనను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందన్నారు. ఆయన మరణం అత్యంత విషాదకరమన్నారు. రామోజీరావు మృతి పట్ల తన ప్రగాడ సంతాపాన్ని తెలుపుతున్నానన్నారు.

ఆధునిక జర్నలిజానికి పితామహుడుగా నిలిచిన రామోజీరావు మృతి మీడియా రంగానికి తీరని లోటన్నారు. అనేక సంస్థలను ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి కల్పించారన్నారు. నిరంతరం ప్రజల మంచికోసం, సమాజ హితం కోసం పరితపించి పనిచేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు అన్నారు. రామోజీరావు మరణం ఒక్క తెలుగు ప్రజలకే కాదు దేశానికి కూడా తీరని లోటన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement