ములుగు జిల్లా పర్యటన లో భాగంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నేడు రామప్ప దేవాలయాన్ని సందర్శించారు ..రుద్రేశ్వరుడినీ దర్శించుకుని గవర్నర్ ప్రత్యెక పూజలు చేశారు. పర్యటనలో భాగంగా అక్కడికి చేరుకున్న ఆయనకు దేవాలయ వేద పండితులు సంప్రదాయ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం పండితులు గవర్నర్ ను పట్టు వస్త్రాల తో సత్కరించి , ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందించారు.
గవర్నర్ పర్యటనలో రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణాభివృద్ధి, స్ర్తీ, శిశు సంక్షేమ, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, భద్రాచలం శాసనసభ సభ్యుడు తెల్లం వెంకటరావు , భూపాలపల్లి శాసనసభ సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు , గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.వెంకటేశం, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పి షభరిష్, ఐటిడిఏ ఏటూరు నాగారం పిఓ చిత్ర మిశ్రా, డి ఎఫ్ ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఆర్డీఓ సత్య పాల్ రెడ్డి దితరులు పాల్గొన్నారు.