Saturday, November 16, 2024

తెలంగాణ కీర్తి కిరీటం – రామ‌గుండం ప‌వ‌ర్ ప్లాంట్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణ ప్రతిష్టను పెంచే అతిపెద్ద పవర్‌ ప్రాజెక్టుగా రామగుండం థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ అవతరించింది. ఆధునిక తరం అభివృద్ధి సూచికల్లో విద్యుత్‌ వినియోగం అత్యంత కీలకంగా మారింది. స్వరాష్ట్రంగా ఏర్పడే సమయానికి ఈ విషయంలో తెలం గాణపై ఎన్నో అనుమానాలు ఉండేవి. వాటన్నింటినీ పటా పంచలు చేస్తూ తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి, వినియోగం రోజు రోజుకూ రికార్డుస్థాయికి పెరుగుతోంది. దీంతో అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పత్తికి ఎన్టీపీసీ ఏర్పాట్లు- చేస్తోంది. ఇప్పుడు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ దేశంలోనే అతిపెద్ద విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంగా మారబోతోంది. ఎన్టీపీ సీలో 2,600 మెగావాట్లతో పాటు- సోలార్‌, ప్లnోటింగ్‌ సోలార్‌, ప్లాంట్ల ద్వారా 4,310 మెగావాట్ల కరెంట్‌ ఉత్పత్తి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కేటా యించిన 4 వేల మెగావాట్లలో ఫేజ్‌-1 కింద 1600 మెగావాట్ల సామర్థం కలిగిన తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యింది. అల్ట్రాసూపర్‌ క్రిటికల్‌ -టె-క్నాలజీతో చేపడుతున్న ప్రాజెక్టులో మొదటగా చిమ్నీ నిర్మాణం పూర్తి చేశారు. గత మార్చి 24న ఇందులో 800 మెగావాట్ల విద్యు దుత్పత్తి ప్రారంభించారు. అలాగే మరో 800 మెగావాట్ల రెండో యూనిట్‌ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఎఫ్‌జీడీ నిర్మాణం, యాష్‌ హ్యాండ్లింగ్‌ సిస్టమ్‌ పూర్తితో స్టీమ్‌ బ్లోయింగ్‌ పునరుద్ధరణ పనులు జరుగుతు న్నాయి. ఈ ఏడాది జూన్‌కి ఈ యూనిట్‌ కూడా అందు బాటు లోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలో ఇప్పటికే 15,498 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్‌ ఉంది. ఎండల తీవ్రతతో మున్ముందు మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, ఫేజ్‌-2 కింద 2,400 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్‌ నిర్మాణ పనులను అగ్రిమెంట్‌ జరిగిన వెంటనే ప్రారం భించాలని అధికారులు భావిస్తు న్నా రు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు- కూ డా సిద్ధం చేశామని ప్రకటించారు. అగ్రిమెంట్‌ ప్రకారం ఫేజ్‌-2 పనులు పూర్తయితే రామగుండం థర్మల్‌ పవర్‌ కార్పోరేషన్‌ ఉత్పత్తి 6,795 మెగావాట్లకు చేరనుంది. ఇప్పటి వరకు మధ్యప్రదేశ్‌లోని వింధ్యాచల్‌ ఎన్టీపీసీలో 4,760 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తితో ముందంజలో ఉంది. రామ గుండం ఎన్టీపీసీ అధికారులు థర్మల్‌ విద్యుత్‌కు మాత్రమే పరిమితం కాకు ండా సోలార్‌, నీటిపై తేలియాడే సౌరపలకలతోనూ విద్యుత్‌ ఉత్పత్తిని చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద ప్లnోటింగ్‌ సోలార్‌ కేంద్రం 100 మగావాట్ల ప్రాజెక్టును రామగుండంలో నిర్మిం చారు. దానికి అదనంగా 85 మెగా వాట్లు- త్వరలోనే జోడిం చబోతున్నారు. గతంలో నిర్మించిన థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల వలె కాక కొత్తగా నిర్మించే ప్లాంట్లలో అత్యాధునిక -టె-క్నాలజీని విని యాగిస్తున్నారు. ఇప్పటికే 1,600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి రంగం సిద్ధం కాగా.. ఇది మరింతగా విస్తరిస్తే దేశంలోనే అతిపెద్ద అల్ట్రామెగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంగా ఎన్టీపీసీ రామగుండం నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఎత్తిపోతల పథకాలు, పారిశ్రామిక వృద్ధి, ఐటీ- పరిశ్రమ వృద్ధి చెందుతోన్న కారణంగా విద్యుత్‌ వినియోగం మరింతగా పెరిగే అవకాశం ఉందని ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సునీల్‌ కుమార్‌ చెబుతున్నారు. అందుకు ఎన్టీపీసీ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఎన్టీపీసీకి రామగుండంలో 9,500 ఎకరాల స్థలం ఉంది. ఇప్పటికే అక్కడ 2,600 మెగావాట్ల సామర్థం ఉన్న థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు సంస్థ నిర్వహిస్తోంది. విభజన చట్టంలోని హామీ అమలులో భాగంగా తొలి విడతగా 1,600 మెగావాట్ల అదనపు సామర్థంతో రామగుండం ప్లాంట్‌ విస్తరణ పనులను ఎన్టీపీసీ ఇప్పటికే ప్రారంభించింది. మిగిలిన 2,400 మెగావాట్ల ప్లాంట్లకు స్థల కేటాయింపుల విషయంలో ఎన్టీపీసీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొంతకాలంగా ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగాయి. చివరకు నల్లగొండ జిల్లా దామరచర్లలో స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రాగా… ఎన్టీపీసీ మాత్రం రామగుండంపైనే పూర్తి ఆసక్తి ప్రదర్శి స్తూ వచ్చింది. మొత్తం 4వేల మెగావాట్ల ప్లాంట్లను రామ గుం డంలోనే నిర్మించాలనే ప్రతిపాదనను సంస్థ సీఎండీ అరుప్‌ రాయ్‌ తాజాగా సీఎం కేసీఆర్‌ ముందుంచారు. ఐతే అధి కారులు రామగుండం మండలం పరిధిలో బీపీఎల్‌ సంస్థకు గతంలో కేటాయించిన నిరుపయోగ భూములను తమకి వ్వాలని కేసీఆర్‌ను కోరుతున్నట్లు- సమాచారం. ఇక్కడే భూమి కేటాయిస్తే 4ఏళ్లలో ఈ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేస్తామని ఎన్‌టీ-పీసీ అధికారులు సీఎంకు తెలిపారు.

అలాగే ఎన్టీపీసీ విస్తరణలో భాగంగా యాష్‌ పాండ్‌ కోసం 400 ఎకరాలు కావాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు- సమాచారం. అయితే గతంతో పోలిస్తే బూడిద వినియోగం గణనీయంగా పెరగడంతో రహదారుల నిర్మాణానికి, ్లఫయాష్‌ ఇటుకల తయారీకి కూడా ముమ్మరంగా వినియోగిస్తున్నా మని అధికారులు చెబుతున్నారు. అలానే పర్యావరణ సం రక్షణకూ తమవంతు చర్యలు తీసుకుంటు-న్నామని అంటు-న్నారు. ప్రధాన మంత్రి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 2 తేలియాడే సౌర విద్యుత్‌ ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. అందులో ఒక-టైన 100 మెగావాట్ల రామగుండం ప్లnోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్ట్‌ ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభమైంది. దేశంలోనే అతిపెద్ద 100 మెగావాట్ల ప్లnోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్ట్‌ అధునాతన సాంకేతికతతో పాటు- పర్యావరణ పరంగానూ ఎంతో ప్రత్యేకమైనదని అధికారులు అంటు-న్నారు. రూ.423 కోట్లతో ఎన్టీపీసీ రిజర్వాయర్‌లో 500 ఎకరాల్లో దీనిని ఏర్పాటు- చేశారు. 40 బ్లాకులుగా విభజించి, ఒక్కొక్క బ్లాక్‌ రెండున్నర మెగా వాట్ల విద్యుదుత్పత్తి అయ్యేవిధంగా విభజించారు. ప్రతి బ్లాక్‌లో ఒక ప్లnోటింగ్‌ ప్లాట్‌ఫారమ్‌తోపాటు- 11,200 సోలార్‌ మాడ్యూల్‌ల శ్రేణి ఉంటు-ంది. ప్లnోటింగ్‌ ప్లాట్‌ఫారమ్‌లో ఒక ఇన్వర్టర్‌, ట్రాన్స్‌ఫార్మర్‌ తో పాటు- హెచ్‌టీ- బ్రేకర్‌ను ఏర్పాటు- చేశారు. ఈ సోలార్‌ మాడ్యూల్స్‌ అన్ని హై-డెన్సిటీ- పాలిథిలిన్‌ మెటీ-రియల్స్‌తో తయారు చేసి ప్లటర్లపై బిగించారు. మొత్తం తేలియాడే వ్యవస్థను… బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ బెడ్‌లో ఉంచిన డెడ్‌ వెయిట్‌లను ప్రత్యేకంగా హై మాడ్యులస్‌ పాలిథిలిన్‌ తాళ్లతో కదలకుండా బిగించారు.
ప్రస్తుతం ఉన్న స్విచ్‌ యార్డు వరకు 33కేవీ అండర్‌గ్రౌండ్‌ కేబుల్స్‌ ద్వారా విద్యుత్‌ తరలిస్తున్నారు. ఇన్వర్టర్‌, ట్రాన్స్‌ ఫార్మర్‌, హెచ్‌టీ- ప్యానెల్‌, పర్యవేక్షక నియంత్రణతో పాటు- డేటా సేకరణ సహా అన్ని విద్యుత్‌ పరికరాలు కూడా.. తేలియాడే ఫెర్రో సిమెంట్‌ ప్లాట్‌ఫారమ్‌లపై ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌ ప్రత్యే కమని అధికారులు చెబుతున్నారు. ఈ తేలియాడే సౌర ఫల కాలు నీరు ఆవిరికాకుండా ఆపడమే కాకుండా ఏటా సుమారు 32.5లక్షల క్యూబిక్‌ మీటర్ల నీటిని పొదుపు చేస్తాయి. అలాగే లక్షా 65వేల టన్నుల బొగ్గును సంవత్సరానికి 2 లక్షల పదివేల టన్నుల కార్బన్‌డైఆ-కై-్సడ్‌ను కూడా ఇవి నివారించ గలుగుతు న్నాయని ఎన్‌టీ-పీసీ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement