గోదావరిఖని, ఆంధ్రప్రభ – నూతన సంవత్సర వేడుకల్లో రామగుండం కమిషనరేట్ పరిధిలోని అధికారులు సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనవద్దని పాల్గొనవద్దని పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఆదేశించారు. పోలీస్ అధికారులతో పాటు సిబ్బంది పోలీస్ స్టేషన్ లతో పాటు ఎక్కడ కూడా కేకులు కట్ చేయవద్దని, సంబరాల్లో పాల్గొనరాదని సూచించారు. డిసెంబర్ 31న రాత్రి, జనవరి ఒకటో తేదీన నూతన సంవత్సర వేడుకల్లో ఎవరు పాల్గొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిసెంబర్ 31న రాత్రి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు, సిబ్బంది ముమ్మరంగా గస్తీ నిర్వహించాలన్నారు.