నిజామాబాద్ రూరల్, 23 ప్రభ న్యూస్ : రూరల్ నియోజకవర్గంలోని చారిత్రక ప్రాధాన్యం ఉన్న నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ధర్పల్లి మండలంలోని అతిపెద్ద గ్రామ పంచాయతీ అయిన ‘‘రామడుగు” గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయిన సందర్భంగా. ముఖ్యమంత్రి కేసీఆర్ కు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. రామడుగును మండలం చేయాలని చాలా కాలంగా అక్కడి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో రామడుగుని మండలంగా ఏర్పాటు చేయడానికి ఉన్న అర్హతలు.. చారిత్రక నేపథ్యాన్ని. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ పలుమార్లు సీఎం కెసీఆర్ ను కలిసి వివరించారు. ఈ మేరకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ ను సీఎం కేసీఆర్ పిలిపించుకుని దీనిపై చర్చించారు. అక్కడి ప్రజలు, ప్రజా ప్రతినిధుల దీర్ఘకాలిక కోరిక మేరకు ముఖ్యమంత్రి రామడుగుని మండలంగా ప్రకటించారు.
ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రస్తుతం ధర్పల్లి, డిచ్పల్లి మండలంలో భాగంగా ఉన్న రామడుగు కొత్త మండలంగా ఏర్పడనుంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ప్రస్తుతం 7మండలాలు ఉన్నాయి. రామడుగు ప్రాజెక్టు మండలాన్ని కలుపుకొని మొత్తం 8 ఎనిమిది మండలాలుగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా రామడుగు, మైలారం చల్లగరిగా గ్రామాలకు చెందిన వీడీసీ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. మండలం ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు, స్థానిక జడ్పిటిసి జిల్లా యువ నాయకులు బాజిరెడ్డి జగన్మోహన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.