హైదరాబాద్ – వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు ఏ-1 రాకేశ్‌రెడ్డికి కోర్టు జీవిత ఖైదు విధిస్తూ గురువారం నాంపల్లి కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈ హత్య కేసుకు సంబంధించి ఇటీవల 23పేజీల ఛార్జ్‌షీట్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు దాఖలు చేశారు. ఇందులో 12 మందిని నిందితులుగా చేర్చారు. రాకేశ్‌రెడ్డి కుట్రపన్ని హనీట్రాప్‌తో జయరాంను దారుణంగా హత్య చేసినట్లు నిరూపించారు. కేసులో 73 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం ఈ కేసులో 11 మందిని నిర్ధోషులుగా తేల్చగా.. ఏసీపీ మల్లారెడ్డితో పాటు మరో ఇద్దరు సీఐలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కేసు వివరాల్లోకి వెళితే.. 31న జనవరి 2019న వ్యాపారవేత్త జయరాం హత్యకు గురయ్యారు. హత్యను రాకేశ్ తన స్నేహితులతో కలిసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత జయరాం మృతదేహాన్ని విజయవాడలోని నందిగామ రహదారిపై వాహనంలో ఉంచారు. డబ్బుల వ్యవహారంలోనే రాకేశ్ హత్యకు పాల్పడ్డారని మే, 2019లో పోలీసులు నేర అభియోగ పత్రం దాఖలు చేశారు. ఈ కేసుపై దాదాపు నాలుగేళ్లపాటు విచారణ కొనసాగింది. చివరకు కీలక నిందితుడు రాకేశ్‌రెడ్డికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెలువరించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement