గత పది సంవత్సరాలుగా నిర్విరామంగా మోదీ చేస్తున్న కృషి ఫలితంగానే బాబా సాహెబ్ కలల సాకారం అవుతున్నాయని ఓ.బి.సి మోర్చ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, బడుగు బలహీనర్గాలు, దళితులు, ఆదివాసుల అభ్యున్నతి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అంబేద్కర్ ఆశయాల సాకారం కొరకు మోది ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అంబేద్కర్ ఆలోచన విధానాలను మోడీ ప్రభుత్వం అమలు పరుస్తోందని తెలిపారు. అన్ని రంగాల్లో దళితులకు ఆదివాసులకు బలహీన వర్గాలకు మోది ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తూ వస్తుందన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే నినాదంతో మోడీ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందన్నారు. 75 సంవత్సారాల స్వాతంత్ర్య దేశంలో మొదటి సారి ఆదివాసి మహిళను రాష్ట్రపతి చేసింది మోడీ ప్రభుత్వం అని తెలిపారు.
గత ప్రభుత్వాలు, గత పాలకులు విస్మరించిన అణచివేసిన వర్గాలను ఎంచుకుని వారికి పెద్ద పీట వేస్తుంది మోడీ ప్రభుత్వమని అన్నారు. అత్యంత పేద వారికి న్యాయం చేయడమే సామాజిక న్యాయంగా మోడి ప్రభుత్వం భావిస్తోందన్నారు. కేవలం విద్యా ఉద్యోగాలకే కాకుండా పారిశ్రామిక వేతలుగా తయారు చేయడానికి స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా కార్యక్రమాలు చేపట్టిందన్నారు. వందల కోట్లు ఖర్చుపెట్టి పంచ తంత్ర కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. కులం, మతం పేరుతో అసమానతలకు గురి కాకుండా మోడీ ప్రభుత్వం పరిపాల చేస్తుందన్నారు. కొంత మంది రాజ్యాంగాన్ని మార్చడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని విష ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అవకాశం వచ్చినప్పుడల్లా దళితులకు మోది ప్రభుత్వం పెద్ద పీట వేస్తూ వస్తుందన్నారు. అంబేద్కర్ నీ రెండు సార్లు కాంగ్రెస్ ఓడించడానికి ప్రయత్నం చేసిందన్నారు. కానీ ఈ రోజు అంబేద్కర్ పేరుతో వారు ముసలి కన్నీరు కారుస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మోడీ పరిపాల జరుగుతుందన్నారు.