కొత్తగూడెంలో రాజీవ్ పార్క్‌ని మస్త్ డెవలప్ చేశారు. 25 లక్షల రూపాయలతో మోడ్రన్‌గా దీన్ని తీర్చిదిద్దారు. అన్ని రకాల హంగులతో ఉన్న ఈ పార్క్‌ని ఇవ్వాల (శనివారం) ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ప్రారంభించారు. పార్క్ లో అన్నిహంగులతో పిల్లలను, పెద్దలను అబ్బురపరిచే ఆహ్లాదకరమైన వాల్ పెయింటింగ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా గ్రీనరీ కూడా ఆకట్టుకునేలా, మనసుకు ప్రశాంతత కలిగించేలా ఉంది.
ఎంట్రన్స్ లో I love Rajeev Park అనే లైటింగ్ తో బోర్డు ఉంది. ఇంకా.. వాకింగ్ ట్రాక్‌తో పాటు పెద్ద స్క్రీన్ తో ఒక స్టేజీని ఏర్పాటు చేశారు. దీనిపై ప్రొజెక్టర్ ద్వారా ప్రజలకు ఏవేర్ నెస్ కలిగించేలా పలు కార్యక్రమాలు నిర్వహించొచ్చు. అంతేకాకుండా క్రికెట్ మ్యాచ్ చూసేందులకు, సాంస్కృతిక కార్యక్రమాలు, బర్త్ డే ప్రోగ్రాముల కోసం కూడా ఈ స్క్రీన్ ఎంతగానే ఉపయోగపడనుంది.