Monday, November 18, 2024

NZB: రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ 10 (ప్రభ న్యూస్) కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగాఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ పేదలను కాపాడుకుటుంద‌ని అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్య నారాయణ అన్నారు. ఆదివారం నిజామా బాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్య నారాయణ ప్రారంభించారు.

ఈ సందర్బంగా దన్పాల్ మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ పథకాన్ని స్వాగత్తిస్తున్నామని అన్నారు. కేంద్రం ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అమలు చేసి ఇక్కడ కూడా అమలు చేయాలనీ కోరిన ఇక్కడ ప్రభుత్వం పట్టించు కోలేదని వాపోయారు.రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కు 60 శాతం నిధులు అందచేస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు ఇచ్చి రాజీవ్ ఆరోగ్య శ్రీ పేరు పెట్టడం జరిగిందన్నారు. కానీ కేంద్రం ప్రభుత్వం ఈ పథకం కింద 60శాతం నిధులు ఇస్తే ఆరోగ్య శ్రీ పై నరేంద్ర మోదీ ఫోటో పెట్టకపోవడం బాధాకర‌మ‌న్నారు. భవిష్యత్తులో ఇటువంటివి పునరవృతం కాకుండా చూసుకోవాలని అధికారులను కోరారు. ఇక్కడ మాత్రం పేర్లు మార్చి పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం అయినా పేదల కోసం పని చేయాలనీ అన్నారు. కేంద్రం నిధులతో నే రాష్ట్రా లు,అభి వృద్ధి జరుగుతా యన్నారు. అధికారులు వెంటనే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్రుష్టి కి తీసుకెళ్లి నరేంద్ర మోదీ ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో కేంద్రం ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారం అవసరం ఉన్న నా వంతుగా కృషి చేస్తాన‌న్నారు. ఈ కార్యక్రమం లో డిఎంహెచ్వో సుదర్శన్, డిప్యూటీ సూపరిడెంట్ బాలరాజ్, డాక్ట‌ర్స్‌, బిజెపి నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement