మంత్రి కేటీఆర్ సూచనల మేరకు ప్రత్యామ్నాయ పంటల మార్పిడి సాగులో భాగంగా రైతులకి విజ్ఞాన యాత్రకు శ్రీకారం చుట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వివిధ మండలలాకు చెందిన 45 మంది రైతులను, ఉద్యాన, వ్యవసాయ శాఖకు చెందిన అధికారులను హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో ఉన్న జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థకి పంపించారు. శిక్షణ కోసం వెళ్లిన రైతులకి ఔషధ, సుగంధ ద్రవ్య మొక్కల సాగుపై శిక్షణ ఇవ్వనున్నారు. అంతేకాదు అవగాహన అందించనున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ చైర్మన్ న్యాల కొండ అరుణ మాట్లాడుతూ.. రైతులు పంట మార్పిడిలో భాగంగా ఓషద సుగంధ మొక్కల సాగుపైన శిక్షణ పొంది.. పంట సాగు చేసి జిల్లాని ఆదర్శంగా తీసుకురావాలని అన్నారు. మంచి దిగుబడి లాభాలను పొందాలని ఆకాంక్షించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital