Friday, November 22, 2024

కడియంకు రాజ‌య్య మ‌ద్ద‌తుదారుల సెగ – రాజన్న ముద్దు అంటూ ధ‌ర్నా..

స్టేషన్ ఘనపూర్: నియోజకవర్గపరిధిలోని కరుణాపురం వద్ద హన్మకొండ హైదరాబాద్ జాతీయ రహదారిపై బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే రాజయ్య మద్దతుదారులు స్టేషన్ ఘనపూర్ బిఆర్ఎస్ టికెట్ ఎమ్మెల్యే రాజయ్య కె ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రోడ్డు పై బైఠాయించారు.

ఈ సందర్బంగా పెద్ద ఎత్తున కడియం కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక నాయకుడు ముద్దు వలసదారులు వద్దు,దళిత దొర కడియం వద్దు దళిత బిడ్డ రాజయ్య ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కడియం దిష్టి బొమ్మ దహనానికి ప్రయత్నించారు.. దీంతో చిల్పూర్ ఎస్సై వినయ్ కుమార్ ఆయన సిబ్బందితో వచ్చి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు పోలీసులకు నాయకులు మధ్య తోపులాట జరిగింది. అనంత‌రం వారంద‌రిని అక్క‌డి నుంచి పంపివేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement