టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. కాంట్రాక్ట్ కోసమే పార్టీ మారినట్లు నిరూపించు.. రాజకీయ సన్యాసం తీసుకుందా.. లేదంటే పీసీసీకి రాజీనామా చేస్తావా అని ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తాడన్నారు. రేవంత్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తే 9 సీట్లు వస్తాయన్నారు. తెలంగాణ కోసం తాను ఆస్తులు అమ్ముకున్నానన్నారు. టీఆర్ఎస్ పై యుద్ధం ప్రకటిస్తున్నానన్నారు. ప్రజాస్వామ్యం కాపాడేందుకే పార్టీ మారుతున్నానన్నారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లివచ్చావు.. తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర లేదన్నారు. నీ రాజకీయ ఉనికి కోసమే కాంగ్రెస్ లో చేరావన్నారు. గ్లోబల్ టెండర్ లో వచ్చిన టెండర్ ను కేంద్రమే తనకు ఇచ్చిందని ప్రచారం చేస్తున్నావన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement