తెలంగాణ రాష్ట్రంలోని రైతన్నల కష్ట సుఖాలను తెలుసుకొని వారికి చేదోడు వాదోడుగా నిలుస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చెంద్రశేఖర్ రావు రైతు బాంధవుడని రంగారెడ్డి జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్ పేర్కొన్నారు. రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మండల కేంద్రమైన నందిగామ రైతు వేదిక భవనంలో వ్యవసాయ శాఖ మండల అధికారిణి శ్వేతా ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో రంగారెడ్డి జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, ఎంపీపీ ప్రియాంక శివశంకర్ గోడ్, సర్పంచ్ జిల్లెళ్ల వెంకట్ రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొని రైతులతో కలిసి రైతుబంధు సంబురాలను ఘనంగా నిర్వహించారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, జై కేసీఆర్ అంటూ గళమెత్తారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతును రాజుగా చూడాలనే ఆకాంక్షతో ప్రతి ఏడాది వానాకాలం, యాసంగికి గాను 10 వేల రూపాయలను రైతులకు అందిస్తున్నారని, దేశంలో ఏ ప్రభుత్వం చేయని విందంగా రైతన్నలకు రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి వాటిని విజయవంతంగా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెరాస ప్రభుత్వమని, రైతుల పక్షపాతిగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్ కు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాలోని ప్రతి రైతు రైతుబంధు వారోత్సవాలను డప్పు వాయిద్యాలతో సంబురంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జంగారి రాములు, మురళి, రైతు సోదరులు, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital