హైదరాబాద్ – రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద కొత్త రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 16 నాటికి వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ పూర్తయి, పాస్‌బుక్ పొందినవారు ఈ సీజన్‌లో రైతుబంధుకు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాల్లో అర్హులైన రైతుల నుంచి ఏఈవోలు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు
కొత్త రైతులే కాకుండా భూమి ఉన్నప్పటికీ గతంలో ఎన్నడూ రైతుబంధు సాయం పొందని రైతులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు