పెద్దపల్లి ప్రభన్యూస్ : రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి అన్నదాతలకు అండగా నిలిచారని కొత్తూరు గ్రామ సర్పంచ్ తాళ్ళ మల్లేశం గౌడ్ అన్నారు. ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో రైతుబంధు ఉత్సవాలలో భాగంగా అంబేద్కర్ విగ్రహం నుండి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు ఆదివారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ చిత్రపటాలకు రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ తాళ్ల మల్లేశం గౌడ్ మాట్లాడుతూ.. రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లోకి 50 వేల కోట్ల రూపాయలను జమ చేసిన సీఎం కేసీఆర్ కు గ్రామ రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అద్యక్షుడు బానోతు శ్రీనివాస్, ఎంపిటిసి తాళ్ళపెల్లి భద్రమ్మ, ఉప సర్పంచ్ బానోతు రాజేశ్వరి రాజేశం, మాజీ ఉప సర్పంచ్ సాగాల కొమురేశం, వార్దు సభ్యులు, గ్రామ టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital