Friday, November 22, 2024

Rains – నేడు, రేపు తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు

హైదరాబాద్ – తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రాగల రెండు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అక్టోబర్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమవుతుందని పేర్కొంది. హైదరాబాద్ సహా మొత్తం రాష్ట్రం సెప్టెంబర్ చివరి వరకు సాధారణ వర్షపాతం ఉంటుందని వెల్లడించింది.

అక్టోబర్ ప్రారంభంలో వాతావరణం క్రమంగా మారుతుందని తెలిపింది. సోమవారం, మంగళవారాల్లో వివిధ జిల్లాల్లో నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, సిద్ధిపేటతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement