హైదరాబాద్ – బంగాళఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో రాగల 48గంటల్లో గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో ఇప్పటికే నగర వాతావరణం కొంత చల్లబడింది. ఉష్ణాగ్రతలు సాధారణ స్థాయికి చేరువగా నమోదవుతున్నాయి. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35.6డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25.2డిగ్రీలు, గాలిలో తేమ 38 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement