హైదరాబాద్ – వేసవి ఎండలతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్తను అందించింది. నేటి నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని ప్రాంతాల్లో.. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ కూడా ఉందని స్పష్టం చేశారు. అలాగే పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లగా మారే అవకాశం ఉందని ఐఎమ్‌డీ తెలిపింది.
కాగా గత 10 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మరి ముఖ్యంగా గడిచిన నాలుగు రోజుల్లో రోజుకు 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగడంతో తీవ్రమైన ఎండతో ప్రజలు అల్లాడిపోయారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ వర్ష సూచన వార్తలు తెలపడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Dailyhunt