తెలంగాణ రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీంతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు వెల్లడించింది. వీటి కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఈరోజు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని ఖమ్మం, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.ఈ వర్షాకాలంలో 20శాతం అధిక వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ తెలిపింది.