హైదరాబాద్‌లో సాయంత్రం వేళ వాతావరణం చల్లబడింది. కాసేపటి క్రితమే వర్షం కూడా మొదలయ్యింది. ఉరుములు, మెరుపులతో ఆకాశం అల్లకల్లోలం అవుతోంది. దీంతో రోడ్లపై వాహనాలతో వెళ్లే ప్రయాణికులు భయపడుతున్నారు. వర్షంతో ఫ్లై ఓవర్లు, మెట్రో కారిడార్‌లోని షెల్టర్ల వద్ద తలదాచుకున్నారు.
ఆఫీసుల నుంచి ఇంటికెళ్లే టైమ్‌లో వర్షం అందుకోవడం, ట్రాఫిక్ చిక్కులు ఒక్కసారే ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అయితే ఉదయం నుంచి ఎండతో ఇబ్బంది పడ్డ హైదరాబాద్ సిటీ జనం వెదర్ మారి కూల్‌గా కావడంతో ఆహ్లాదాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.