ఆంధ్రప్రభ స్మార్ట్, తెలంగాణ న్యూస్ నెట్‌వర్క్ : బంగాళాఖాతంలో ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలో ముసురు పట్టింది. సోమవారం ఉదయం నుంచి వర్షం పడుతునే ఉంది. గత రాత్రి భారీ వర్షం కురిసింది. తెరిపివ్వకుండా కంటీన్యూ వర్షం పడుతుంది. వర్షపు నీరు చేరడంతో భూపాల్లిపల్లి జిల్లాలో సింగరేణి రెండు, మూడు యూనిట్లలో బొగ్గు తవ్వకాలు నిలిచిపోయాయి. రోజుకు ఆరు వేల టన్నుల బొగ్గు త్వకాలు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. మున్నేరు శాంతించడంతో ఖమ్మం నగర వాసులు ఊపిరి పీల్చుకున్నారు. మేడిగడ్డ వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.
పలు జిల్లాల్లో వర్షాలు…
తెలంగాణలో ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో వర్షం కురుస్తునే ఉంది. గత రాత్రి భారీగా వర్షం కురిసింది. సోమవారం ఉదయం నుంచి తెరిపివ్వకుండా ముసురు పట్టి వర్షం పడుతోంది. మధ్యాహ్నం వరకూ అలానే పడుతూనే ఉంది.
నిలిచిన బొగ్గు తవ్వకాలు
భూపాలపల్లి జిల్లాలో సింగరేణి-2, 3 గనుల్లో బొగ్గు తవ్వకాలు నిలిచిపోయాయి. సింగరేణి-2 లో 3000 మెట్రిక్ టన్నుల బొగ్గు, సింగరేణి-3 లో 2500 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
మేడిగడ్డ వద్ద గోదావరి ఉధృతి
మేడిగడ్డ వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇన్‌ఫ్లో 3,20,080 క్యూసెక్కుల నీరు ఉండగా, అదే స్థాయిలో బయటకు విడుదల చేస్తున్నారు.
శాంతించిన మున్నేరు
మున్నేరు వాగు శాంతించింది. దీంతో ఖమ్మం సిటీ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో మరోసారి వరద వస్తోందని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కొంతమందికి పునరావాస కేంద్రాలకు తరలించారు. రాత్రి కూడా మున్నేరుకు వరద భయం వెంటాడింది. సోమవారం ఉదయం నుంచి మున్నేరు సాధారణ స్థితికి చేరింది.