Friday, November 22, 2024

వర్షాలు వచ్చేస్తున్నాయ్… జూన్ 5న తెలంగాణలోకి రుతుపవనాలు

ఏప్రిల్, మే నెలల్లో భారీగా ఎండలు మండాయి. ఈ ఎండలు తగ్గనున్నాయ్… వర్షాలు వచ్చేస్తున్నాయ్.. జూన్ 5న తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దీంతో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని తెలిపింది. జూన్ 5న తెలంగాణలో ప్రవేశించే రుతుపవనాలు 5 లేదా 6వ తేదీల్లో పురోగమిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రుతుపవనాల కదలిక ప్రస్తుతం కేరళలో కన్నూర్, పాలక్కాడ్ పరిసర ప్రాంతాల గుండా కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement