Thursday, November 21, 2024

భాగ్యనగరాన్ని ముంచెత్తిన వర్షం

హైద‌రాబాద్ న‌గ‌రాన్ని వ‌ర్షం మ‌రోసారి ముంచెత్తింది. ఈదురుగాలుల‌తో కూడిన వాన ప‌డింది. ఉద‌యం నుంచి ఎండ దంచికొట్ట‌గా.. మ‌ధ్యాహ్నం వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డింది. సాయంత్రం స‌మ‌యానికి ఆకాశం మేఘావృత‌మై వ‌ర్షం కురిసింది. నాంప‌ల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ, కొండాపూర్,  ఖైర‌తాబాద్‌, అమీర్‌పేట‌, సోమాజిగూడ‌, పంజాగుట్ట‌, కూక‌ట్‌ ప‌ల్లి, మియాపూర్, బేగంపేట‌, సికింద్రాబాద్, ఉప్ప‌ల్, బోయిన్‌ప‌ల్లి, ఎల్బీన‌గ‌ర్‌, హ‌య‌త్‌న‌గ‌ర్‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, చార్మినార్‌, మెహిదీప‌ట్నం, అఫ్జ‌ల్‌ గంజ్, ల‌క్డికాపూల్, టోలిచౌకి, రాంన‌గ‌ర్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది. ఈదురుగాలులు వీచ‌డంతో ప‌లు చోట్ల విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌లిగింది. చెట్లు నేల‌కొరిగాయి. వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల వాహనాలు నీళ్లలో చిక్కుకుపోయాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement